జాతీయం

Delhi Unlock : ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ..!

ఢిల్లీలో ఒకానొక దశలో పాజిటీవిటి రేటు 35 శాతానికి చేరింది.. దీనితో లాక్ డౌన్ విధించక తప్పలేదు. లాక్ డౌన్ కారణంగా ఢిల్లీలో పాజిటివీటి రేటు ఒకటిన్నర శాతానికి తగ్గింది.

Delhi Unlock : ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ..!
X

ఎల్లుండి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ మొదలు కానుంది. సుమారుగా నెల రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్‌ అమలవుతుంది. ఒక వారం రోజులే లాక్డౌన్ విధిస్తామని చెప్పిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్... కరోనా అదుపులోకి రాకపోవడంతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ వచ్చారు. అయితే ప్రజలు ఆకలితో చనిపోకూడదు అనే ఉద్దేశంతో అన్ లాక్ ప్రక్రియ మొదలు పెడుతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. రోజు కూలీ చేసుకుని బతుకుతున్న వారిపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపుతుందని, కార్మికులను దృష్టిలో పెట్టుకొని అన్ లాక్ కి తెర తీస్తున్నామని చెప్పారు.

ముందుగా నిర్మాణరంగ కార్యకలాపాలు, పరిశ్రమలను తెరవనున్నామని తెలిపారు. ఢిల్లీలో ఒకానొక దశలో పాజిటీవిటి రేటు 35 శాతానికి చేరింది.. దీనితో లాక్ డౌన్ విధించక తప్పలేదు. లాక్ డౌన్ కారణంగా ఢిల్లీలో పాజిటివీటి రేటు ఒకటిన్నర శాతానికి తగ్గింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 1,100 కరోనా కేసులు నమోదయ్యాయని సీఎం తెలిపారు.

కరోనా అదుపులోకి రావడంతో ఒక్కో రంగానికి అనుమతిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటికే విధించిన లాక్ డోన్ సోమవారం ఉదయం అయిదు గంటల వరకు కొనసాగుతుంది. ఇక ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు 5లక్షల వరకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. ఇందుకు కావలసిన విధివిధానాలను రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కరోనాతో చనిపోయిన కుటుంబీకులకు ప్రస్తుతం ఇస్తున్న 50వేలకు ఇది అదనం అని కేజ్రీవాల్ ప్రకటించారు.

కరోనా వైరస్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు ఆ పిల్లలకి 25 సంవత్సరాలు వచ్చే వరకు నెలకి 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది. కరోనా కారణంగా భర్త లేదా భార్యను కోల్పోయిన వారికి పెన్షన్ అందిస్తామని తెలిపారు. వివాహం కాని వ్యక్తి మరణిస్తే వారి తల్లిదండ్రులకు పెన్షన్ ఇస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
Next Story

RELATED STORIES