ఇప్పపువ్వుతో గర్భిణీ స్త్రీలకు..

ఇప్పపువ్వుతో గర్భిణీ స్త్రీలకు..
కానీ ఈ మధ్య కాలంలో గర్భం దాల్చిన మహిళలు మృత్యువాత పడుతున్న సంఘటనలు వినిపిస్తున్నాయి. దీనికి కారణాన్ని విచారిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణుల్లో చాలా మందికి హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని తేల్చారు.

అడవుల్లో తిరిగి, అక్కడ దొరికేవే తింటూ ఆరోగ్యం పట్ల అవగాహన లేకుండా ఉంటారు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అడవి బిడ్డలు. కాలుష్య కాసారాలకు దూరంగా, కల్మషం లేని మనసులతో కలిసిమెలిసి జీవిస్తుంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ ఒక్కటై నిలబడతారు. కానీ ఈ మధ్య కాలంలో గర్భం దాల్చిన మహిళలు మృత్యువాత పడుతున్న సంఘటనలు విషాదకరం.

దీనికి కారణాన్ని విచారించి ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణుల్లో చాలా మందికి హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని తేల్చారు వైద్యాధికారులు. ఎర్రరక్తకణాలు తగ్గిపోవడం, వ్యాధి నిరోధక శక్తి క్షీణించడంతో వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో లక్ష మంది గర్భిణుల్లో 152 మంది, పుట్టిన వెయ్యి మంది చిన్నారుల్లో 48 మంది మరణిస్తున్నారు. ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువై తల్లీబిడ్డలు మృత్యువాత పడుతున్న ఘటనలు కోకొల్లలు. ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించింది.

కాబోయే అమ్మకు అండగా నిలబడాలనుకున్నారు ఏజెన్సీ అధికారులు. ప్రసవ మరణాలను తగ్గించాలనుకున్నారు. అందుకోసం ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా దొరికే ఇప్పపువ్వుతో లడ్డూలను తయారు చేసి గర్భిణీ స్త్రీలకు అందిచాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ అధికారులు నిర్ణయించారు.

ఈ ప్రక్రియను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో ఏప్రిల్ 15 నుంచి అమలు చేస్తారు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 82 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 3,245 మంది గర్భిణులకు ఈ లడ్డూలను అందించనున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.10 లక్షల నిధులను కేటాయించింది.

Tags

Read MoreRead Less
Next Story