Mamata Banerjee : టీఎంసీ పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్

Mamata Banerjee : టీఎంసీ పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్
యుగ ల్యాబ్స్ అనేది అమెరికాలో ఉన్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కంపెనీ అని తెలిపారు. ఇది క్రిప్టో కరెన్సీ లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది

తృణముల్ కాంగ్రెస్ పార్టీ (TMC) ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయింది. పేరు, లోగోను హ్యాకర్లు మార్చివేశారు. మంగళవారం టీఎమ్సీ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయినట్లుగా గుర్తించారు. ట్విట్టర్ ఎకౌంట్ లోని పార్టీ లోగోను, పేరును హ్యకర్లు మార్చి యుగ ల్యాబ్స్ అని పేరుమార్చారు. ఇప్పటివరకు హ్యాకర్లు ఎలాంటి పోస్ట్ లను ట్వీట్ చేయలేదని తెలిపారు టీఎమ్సీ ప్రతినిధులు. యుగ ల్యాబ్స్ అనేది అమెరికాలో ఉన్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కంపెనీ అని తెలిపారు. ఇది క్రిప్టో కరెన్సీ, డిజిటల్ మీడియాలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నట్లు చెప్పారు.


గతేడాది డిసెంబర్ 10న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. అంతులో క్రిప్టో కరెన్సీని ప్రచారం చేశారు హ్యాకర్లు. పార్టీ యొక్క బయో డిస్క్రిప్షన్, ఫోటో మార్చివేశారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్ కు గురైంది. ఏప్రిల్ 2022లో ఉత్తర ప్రదేశ్ సీఎం కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్ కు గురైంది. ఖాతా నుంచి సీఎం యోగీ ఫొటోను తొలగించారు.

Tags

Read MoreRead Less
Next Story