Top

మాటల వాడి పెంచిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..!

బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాటల వాడి పెంచారు. మోదీ నుంచి యోగీ దాకా ఎవరినీ వదిలిపెట్టకుండా

మాటల వాడి పెంచిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..!
X

బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాటల వాడి పెంచారు. మోదీ నుంచి యోగీ దాకా ఎవరినీ వదిలిపెట్టకుండా ఆరోపణలు గుప్పించిన దీదీ... ఇప్పుడు సీఆర్‌పీఎఫ్‌పై విరుచుకుపడ్డారు. పోలింగ్ జరుగుతున్నప్పుడు సీఆర్‌పీఎఫ్ బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. పోలింగ్ జరుగుతున్నప్పుడు బీజేపీకిగానీ, కేంద్ర బలగాలకుగానీ భయపడొద్దని మమతా బెనర్జీ ఓటర్లను కోరారు. అయితే తాను కేంద్ర బలగాలను నిందించడం లేదని, కానీ వాటి బాధ్యత మాత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖదేనని అన్నారు. బీజేపీ గూండా ఇజానికి పాల్పడుతోందని మమత మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశం యావత్తు కన్నీరు పెడుతోందని మమత ఆరోపించారు. బెంగాల్ మరో గుజరాత్‌లా మారాలని కోరుకుంటున్నారా? అంటూ ఆమె హూగ్లీ జిల్లా బాలాగఢ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించారు. ఈసారి బెంగాల్‌ను రక్షించుకోవల్సిన అవసరం ఉందన్నారు.

Next Story

RELATED STORIES