Top

వేడి వేడి దోశ.. వేసేస్తా సైకిల్ మీద.. వీడియో వైరల్

ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా బోల్డంత డబ్బు పెట్టుబడి పెట్టాలి. అంత లేదని కూర్చుంటే నాలుగు వేళ్లు లోపలికి వెళ్లాలి.

వేడి వేడి దోశ.. వేసేస్తా సైకిల్ మీద.. వీడియో వైరల్
X

ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా బోల్డంత డబ్బు పెట్టుబడి పెట్టాలి. అంత లేదని కూర్చుంటే నాలుగు వేళ్లు లోపలికి వెళ్లాలి. నన్ను నమ్ముకున్న వారు సుఖంగా ఉండాలి అంటే ఎలా సాధ్యమవుతుంది. అందుకే నాకున్న సైకిల్‌నే నా వ్యాపారానికి వాడుకున్నాను.

దోశలు వేస్తూ వీధి వీధి తిరిగి కస్టమర్‌కి వేడి వేడి దోశలు అందిస్తున్నాను. ఇప్పుడు కాదు 25 సంవత్సరాలుగా ఇదే వ్యాపారం చేస్తూ నేను, నా కుటుంబం చాలా హ్యాపీగా ఉన్నామని అంటున్నారు ముంబైకి చెందిన ఓ వ్యక్తి.

ఇతడి విజయ గాథను ఓ యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తీసుకు వచ్చింది. దాంతో ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. దీంతో అతడి దోశలకు గిరాకీ మరింత ఎక్కువైంది. ఇక ఇతడు అమ్మేది మామూలు దోశ కాదు.

వెరీ స్పెషల్ పిజ్జా దోశ. క్షణాల్లో మన కళ్ల ముందే అన్నీ నీట్‌గా కట్ చేసి అందులో టమాటా సాస్, చీజ్ లాంటివి కూడా జోడించి రుచిగా, శుచిగా చేసి అందిస్తాడు. అతడు వేయడం చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంక తింటే ఎంత టేస్ట్‌గా ఉంటుందో అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ఈ ఫ్యూజన్ దోశలో రకరకాల వెజిటబుల్స్, స్కీజ్వాన్ సాస్, వెల్లుల్లి పచ్చడి ఛీజ్ వంటివి వేస్తాడు. ఈ దోశ విక్రేత 25 సంవత్సరాలుగా మలాడ్ ప్రాంతంలో నామమాత్రపు రేటు రూ. 60 -100 కు వివిధ రకాల దోశలను విక్రయిస్తున్నారు.Next Story

RELATED STORIES