Maoist RK : మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆర్కే మృతి

Maoist RK : మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత అయిన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే కన్నుమూశారు.

Maoist RK :  మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆర్కే మృతి
X

Maoist RK : మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత అయిన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే కన్నుమూశారు. ఆయన మరణవార్తను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కూడా ధ్రువీకరించారు. సుకుమా-బీజాపూర్‌ అడవుల్లో అనారోగ్యంతో ఆయన చనిపోయినట్లుగా చెప్తున్నారు.

ఐతే.. మావోయిస్టు పార్టీ దీన్ని అధిరికంగా చెప్పడం లేదు. స్థానికంగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్కే అనారోగ్యంతో మరణించడంతో ఆయన అంతిమ సంస్కారాల్ని కూడా పూర్తి చేశారు. అంతు చిక్కని వ్యాధి వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు మావోయిస్టు సానుభూతిపరులు చెప్తున్నారు. లంగ్స్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టడంతో చనిపోయినట్టు తెలుస్తోంది.

పార్టీలో ముఖ్యులు అజ్ఞాతంలో ఉండగా మరణిస్తే.. పార్టీనే వారి అంత్యక్రియలు పూర్తి చేసే సంప్రదాయం ఉందని.. ఆర్కే అంత్యక్రియలు కూడా ఇలాగే పూర్తి చేశారని తెలుస్తోంది. ఐతే.. ఇటు కుటుంబ సభ్యులకు కూడా ఆర్కే మరణంపై పోలీసుల నుంచి కానీ, మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.

Next Story

RELATED STORIES