ఓ మహిళ అయి ఉండి మీరిలా కామెంట్ చేయడం..: మారుతి ఫైర్

ఓ మహిళ అయి ఉండి మీరిలా కామెంట్ చేయడం..: మారుతి ఫైర్
మాతృత్వపు మధురిమలను ఆస్వాదించడంతోనే ఓ మహిళ తన జీవితం పరిపూర్ణమైనదిగా భావిస్తుంది.

ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలిస్తే ఆ తల్లి ఎంతో ఉప్పొంగి పోతుంది.. దానికి మించి ప్రపంచంలో మరే విషయం ఆమెను సంతోషపరచలేదు.. బాలీవుడ్ నటి అనుష్కశర్మ తాను తల్లిని కాబోతున్నాననే వార్తను అభిమానులతో పంచుకుంది.. ఆ సుమధుర క్షణాలను ఆస్వాదిస్తున్న ఆమె తాజాగా మరో పోస్ట్ పెట్టారు. అది చూసిన ఓ మహిళా జర్నలిస్ట్ వ్యగ్యంగా ప్రతిస్పందించారు.. అనుష్కా.. ఆయన మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశారు.. ఇంగ్లాడ్ కి మహారాణిని చేయలేదు కదా.. మరీ అంత ఆనందం అవసరమా అన్నట్లు మాట్లాడారు.. దాంతో ఆమె చేసిన కామెంట్ చూసిన టాలీవుడ్ దర్శకుడు మారుతి ఫైర్ అయ్యారు..

మీరు ఒక మహిళ అయి ఉండి ఇలా మాట్లాడడం భావ్యం కాదు.. ఓ మహిళ రాజ్యానికి రాణిగా ఉండడం కంటే ఓ బిడ్డకి తల్లిగా ఉండడంలోనే ఎక్కువ సంతోషపడుతుంది అని ఆయన అన్నారు. మాతృత్వపు మధురిమలను ఆస్వాదించడంతోనే ఓ మహిళ తన జీవితం పరిపూర్ణమైనదిగా భావిస్తుంది. నిజానికి ప్రతి మహిళా ఓ మహరాణినే.. సంతోషాలు నిండే ఉండే ప్రతి గృహం ఓ రాజ్యమే. ఆమె సెలబ్రిటీ కావడానికంటే ముందు ఓ సాధారణ స్త్రీ. తల్లి కాబోతున్న ఆ క్షణాలను ఆనందించే హక్కు ఆమెకు ఉంది అని మారుతి వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story