Minor Girls Marriage : ఇద్దరూ అమ్మాయిలే..పేర్లు కూడా ఒక్కటే.. పెళ్ళితో ఒక్కటయ్యారు!

Minor Girls Marriage : ఇద్దరూ అమ్మాయిలే..పేర్లు కూడా ఒక్కటే.. పెళ్ళితో ఒక్కటయ్యారు!
Minor Girls Marriage : వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. చివరకు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇందులో పెద్ద వింతేముంది అనుకోవచ్చు.

Minor Girls Marriage: వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. చివరకు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇందులో పెద్ద వింతేముంది అనుకోవచ్చు.. పెళ్లి చేసుకుంది యువతి యువకుడు కాదు.. ఇద్దరు అమ్మాయిలే.. అయితే వారికింకా 18 సంవత్సరాలు కుడా నిండలేదు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇద్దరి పేర్లు కూడా ఒక్కటే కావడం.. వారిద్దరి పేర్లు పూజ.. ఇందులో ఒకరి వయసు 14 కాగా, మరొకరికి 13 సంవత్సరాలు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ప్రాంతంలో సుగాయ్‌దిహ్‌ గ్రామానికి చెందిన ఈ ఇద్దరు బాలికలు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్.. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. దీనితో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంట్లో చెప్పారు. దీనితో వారి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇది తప్పని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఇంతలో ఒక అమ్మాయి అబ్బాయిలాగా మారింది. షర్ట్, ప్యాంట్ వేసుకుని పురుషుడిలా కనిపించింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తోటి ఫ్రెండ్స్ సలహా అడిగారు. అందుకు వారు నో అన్నారు. దీంతో వారిద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంట్లో విషయం చెప్పకుండా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు.

అయితే తాళి కట్టించుకున్న అమ్మాయి మెడలో సోమవారం మంగళసూత్రం చూసిన ఆమె తల్లి ప్రశ్నించింది. ఎవరు కట్టారని ప్రశ్నించడంతో విషయం చెప్పేసింది. దీనితో ఆమె తల్లిదండ్రులు వెంటనే సరాయిధేలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ వారు మేము కలిసే ఉంటామని అన్నారు. కానీ వారికి 18 ఏళ్లు నిండకపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉండమని, ఇది కేవలం తాత్కాలికమేనని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story