సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం.. ఆ ఫైలుపై తొలి సంత‌కం..!

సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం.. ఆ ఫైలుపై తొలి సంత‌కం..!
రాజ్‌భ‌వ‌న్‌లో త‌మిళ‌నాడు నూత‌న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం అక్కడి నుంచి నేరుగా సెక్రెటేరియ‌ట్‌కు వెళ్లి అక్కడ, ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు.

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి MK స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భ‌వ‌న్‌లో త‌మిళ‌నాడు నూత‌న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం అక్కడి నుంచి నేరుగా సెక్రెటేరియ‌ట్‌కు వెళ్లి అక్కడ, ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. ముందుగా క‌రోనా సాయం ఫైలుపై తొలి సంత‌కం చేశారు. దాంతో క‌రోనా సాయం కింద తెల్ల‌ రేష‌న్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి రూ.4000 చొప్పున ఆర్థిక సాయం అంద‌నుంది.

అయితే ఈ ఆర్థిక సాయాన్ని మే, జూన్ నెల‌ల్లో రెండు విడుత‌లుగా అందజేస్తామని సీఎం వెల్లడించారు. మొద‌టి విడుత రూ.2000 ఈ నెల‌లోనే ఇవ్వనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన బీమా కార్డులు క‌లిగి ఉన్న ప్రతి ఒక్కరికీ క‌రోనా చికిత్సల‌కు అయ్యే ఖ‌ర్చులను మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భ‌రిస్తుంది. వీటితో పాటుగా సిటీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్రయాణ సౌక‌ర్యం ఫైలుపై కూడా స్టాలిన్ సంత‌కం చేశారు. ఇక పాల ధ‌ర‌ల‌ను లీట‌ర్ పాల‌పై రూ.3 చొప్పున త‌గ్గించ‌నున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story