పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు.. కరోనా కంట్రోల్: సీసీఎంబీ

పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు.. కరోనా కంట్రోల్: సీసీఎంబీ
కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

కోవిడ్‌కి వ్యాక్సిన్ వచ్చేలోపు కొంతైనా రిలీఫ్ కోసం ప్రముఖ ఔషధ తయారీ సంస్థలు ఫుడ్ సప్లిమెంట్‌ను రూపొందించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అటల్ ఇంక్యుబేషన్‌లోని అంకుర సంస్థ క్లోన్ డీల్స్, సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీతో సంయుక్త పరిశోధనలు చేసి పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని గుర్తించింది. వీటిలోని బీటా గ్లూకాన్స్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి.

పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్, కర్కమిన్‌తో కలిసి ద్రవ రూపంలో ఉత్పత్తి చేస్తున్న ఆహారం ఒకటి అందుబాటులోకి రానుంది. పసుపు మిశ్రంతో కలిసి రూపొందించిన ఈ ఆహార పదార్ధం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించనుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహద పడుతుంది.

ఇప్పటికే ఎయిమ్స్ క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగిస్తోంది. ఈ ప్రొడక్ట్ పని తీరుపై ఎయిమ్స్ నాగ్‌పూర్, భోపాల్, నవీ ముంబయి కేంద్రాల్లో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లోకి రానుందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story