గ్రీన్ టీ గురించి అపోహలు మరియు వాస్తవాలు

గ్రీన్ టీ గురించి అపోహలు మరియు వాస్తవాలు
బరువు తగ్గేందుకు, గుండె పనితీరు మెరుగుపరిచేందుకు, క్యాన్సర్ నివారణకు గ్రీన్‌టీ అత్యుత్తమమైనది.

గ్రీన్ టీ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో ఒకటి. వేల సంవత్సరాల నుంచే చైనాలో గ్రీన్‌టీ వాడుకలో ఉంది. దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుని ప్రపంచమంతా గ్రీన్‌టీని వాడడం మొదలు పెట్టింది. బరువు తగ్గేందుకు, గుండె పనితీరు మెరుగుపరిచేందుకు, క్యాన్సర్ నివారణకు గ్రీన్‌టీ అత్యుత్తమమైనది. అయితే గ్రీన్‌టీ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. అవి ఎంత వరకు నిజం అనేది తెలుసుకుందాం.

1. భోజనం చేసిన వెంటనే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచిది కాదు. ఆహారంలో ఉన్న ప్రొటీన్‌ని శరీరం గ్రహించుకోనివ్వదు. ఇది గ్రీన్‌టీకి కూడా వర్తిస్తుంది.

2. గ్రీన్ టీని వేడిగా తాగకూడాదు. గోరు వెచ్చగా తాగాలి.

3.పరగడుపున ఎప్పుడూ తాగకూడదు. ఖాళీ కడుపులో ఆసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. గ్రీన్ టీ ఎప్పుడైనా ఏదైనా తిన్న తరువాతే తీసుకోవాలి.

4. వేడిగా ఉన్నప్పుడు గ్రీన్‌టీలో తేనె కలపకూడదు. గోరు వెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి.

5. ఇక ట్యాబెట్లు లాంటివి గ్రీన్ టీ తాగే ముందు వేసుకోకూడదు.

6. గ్రీన్ టీ మంచిది అని ఎన్ని సార్లు తీసుకున్నా తప్పు కాదని భావిస్తుంటారు. కానీ అది సరి కాదు. మామూలు కాఫీ, టీలలో ఉన్నట్లే గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది. అందుకే రోజుకి రెండు మూడు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తీసుకోకూడదు.

7. గ్రీన్ టీ బ్యాగ్‌ని కానీ, ఆకులు కానీ ఎక్కువ సేపు వేడి నీటిలో ఉంచకూడదు. రుచి కోల్పోవడంతో పాటు హానికరం కూడా.

8. గ్రీన్ టీ బ్యాగ్స్‌ని గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి.

Tags

Read MoreRead Less
Next Story