బిగ్‌బాస్..ప్రేక్షకులకు ఏం చూపించాలనుకుంటున్నారు..

బిగ్‌బాస్..ప్రేక్షకులకు ఏం చూపించాలనుకుంటున్నారు..
బిగ్ బాస్.. షో చూడాలన్న ప్రేక్షకుల ఆసక్తిని చంపేస్తుంది ఎపిసోడ్. ప్రేక్షకుడికి ఎగ్జయిట్‌మెంట్ కలిగించలేకపోతున్నాడు

లవ్‌స్టోరీలు.. అర్థరాత్రి రొమాన్సులు.. బిగ్‌బాస్4లో కావాల్సినంత కంటెంట్.. అభిజిత్-హారిక హగ్గులు, అఖిల్-మోనాల్ రొమాన్సులు, సోహెల్-అమ్మ రాజశేఖర్ ఆర్గ్యుమెంట్లు.. పిచ్చి పిచ్చి టాస్కులు. వెరసి బోర్ కొట్టిస్తున్న బిగ్ బాస్.. షో చూడాలన్న ప్రేక్షకుల ఆసక్తిని చంపేస్తుంది ఎపిసోడ్. ప్రేక్షకుడికి ఎగ్జయిట్‌మెంట్ కలిగించలేకపోతున్నాడు బిగ్ బాస్. మొదటి నుంచి ఎలిమినేషన్ రౌండ్‌లో ఉంటూ వచ్చిన కుమార్ సాయి బురదలో కాయిన్స్ వెతుకులాట గేమ్‌లో విజేతగా నిలిచి కెప్టెన్సీని సొంతం చేసుకున్నాడు. ఆ విధంగా ఈ వారం ఎలిమినేషన్ నుంచి కుమార్ సాయి గట్టెక్కాడు.

స్వాతీ దీక్షిత్ హౌస్ లోకి ఎందుకు వచ్చిందో అర్థం కాదు సగటు ప్రేక్షకుడికి. ఇక మోనాల్‌కి ఎలా ఓట్లు పడుతున్నాయో తెలియదు. ఆట కంటే అఖిల్‌తో ముచ్చట్లు పెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. గంగవ్వకి రోజు రోజుకి ఉత్సాహం తగ్గిపోయినట్లు ముఖంలో కనిపిస్తున్నా మరికొన్ని రోజులు హౌస్‌లో ఉండడానికి ప్రయత్నిస్తోంది. హౌస్‌లోని సభ్యులను కొద్దో గొప్పో ఎంటర్‌టైన్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story