Top

బిగ్‌బాస్4..అవినాష్ అద్దంగా మారి.. అమ్మాయిలను ఆటాడుకుని..

అవినాష్ అధ్దంగా మారి తన కామెడీతో అదరగొట్టాడు. తన శైలిలో కామెడీ చేసి కంటెస్టెంట్లను, ప్రేక్షకులను నవ్వించాడు.

బిగ్‌బాస్4..అవినాష్ అద్దంగా మారి.. అమ్మాయిలను ఆటాడుకుని..
X

చప్పగా సాగుతున్న షోకి కాస్త ఊపుని తీసుకు వచ్చింది చందనా బ్రదర్స్. ఈ షోరూమ్ వాళ్లు ఇచ్చిన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేశారు కంటెస్టెంట్లు. విన్నర్స్‌కి లక్ష రూపాయల గిప్ట్ ఓచర్.. అమ్మాయిలు అవినాష్‌ని విన్నర్‌గా ప్రకటించి మంచి పని చేశారు. ఇక అబ్బాయిలు కూడా ఎందుకొచ్చిన గొడవ.. గంగవ్వని ప్రకటిస్తే అలకలు గట్రా ఉండవని ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఆమెనే ఎంపిక చేశారు. ఇక గెలిచిన అవినాష్ అధ్దంగా మారి తన కామెడీతో అదరగొట్టాడు.

తన శైలిలో కామెడీ చేసి కంటెస్టెంట్లను, ప్రేక్షకులను నవ్వించాడు. దాన్ని కూడా సరదాగా తీసుకోని సుజాత బుంగ మూతి పెట్టి అవినాష్‌పై అలిగింది. ఇక అవినాష్ ఆమెని బతిమాలి కోపాన్ని చల్లార్చాడు. గార్డెన్ ఏరియాలోకి వచ్చి బిగ్ బాస్ ఇలాంటి టాస్క్‌లు ఇవ్వకుండా ఉండాల్సింది. ఫీలవుతున్నారు అనేసరికి అరియానా అదేంటా అలా మాట్లాడతావు టాస్క్ ఇవ్వొద్దని బిగ్ బాస్‌కి నువ్వెలా చెబుతావు. నీ ఆట నువ్వు ఆడు అని అవినాష్‌లో స్పూర్తి నింపింది. నువ్వో మంచి కామెడీ యాక్టర్‌వి. నువ్వింకా పైకి ఎదగాలి అని అతడిని ఉత్సాహపరిచింది. అరియానా మొదటి నుంచి గేమ్ ని గేమ్ లానే ఆడలాని చెబుతూనే ఉంటుంది. ఎవరికైనా. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరో అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

Next Story

RELATED STORIES