ఆదివారం అలరించిన బిగ్‌బాస్

ఆదివారం అలరించిన బిగ్‌బాస్
ఆదివారం బుల్లితెర ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్‌టైన్మెంట్ అందించారు.

అమ్మాయిలు అబ్బాయిల్లా, అబ్బాయిలు అమ్మాయిల్లా వేషధారణలు.. వాటితోనే టాస్క్‌లు మొత్తానికి చాలా రోజులు తరువాత ఇంటిల్లపాదీ కూర్చుని చూసేలా సరదాగా సాగింది ఆదివారం నాటి బిగ్‌బాస్ ఎపిసోడ్. ఆదివారం అంటేనే ఎలిమినేషన్ అని అందరూ సీరియస్‌గా మారిపోతారు. కానీ ఆ ప్ర్రకియను శనివారమే పూర్తి చేసి సస్పెన్స్‌‌కు తెరదించారు హోస్ట్ నాగార్జున. ఆదివారం బుల్లితెర ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్‌టైన్మెంట్ అందించారు. స్వాతీ దీక్షిత్ వచ్చిన పది రోజుల్లోనే హౌస్‌లో ఉన్న సభ్యులపై ఒక అభిప్రాయానికి వచ్చేసింది. ఎలిమినేట్ అయి వెళ్లిపోతూ ఒక్కొక్కరి మీదా ఒక్కో ట్యాగ్ వేసి వెళ్లింది.

ఇక అడవేషం వేసిన అమ్మరాజశేఖర్ స్కిట్‌ని అదరగొట్టేశారు. చూడాలని ఉంది సినిమాలో సౌందర్య, చిరంజీవిల మధ్య జరిగే ఫన్నీ సినిమా ఎంత ఫేమస్సయిందో అందరికీ తెలిసిందే. అదే సీన్ అమ్మ రాజశేఖర్, సుజాతల మధ్య సాగింది. ఎపిసోడ్‌కే హైలెట్‌గా నిలిచిన ఈ సీన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక సోహెల్, అరియానాలది బెస్ట్ డ్యాన్స్ ఫెర్మామెన్స్ అని చెప్పారు నాగార్జున. ఇక ఫైనల్‌గా ఎలిమినేషన్‌లో ఎవరూ లేరని ఎవరి ఆట వారు ఆడాలని ముగించారు.

Tags

Read MoreRead Less
Next Story