National: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

National: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు
ఎంపీగా చెల్లుబాటు కాదని లోక్‌ సభ సెక్రెటరీ నోటిఫికేషన్‌ జారీ

కాంగ్రస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడింది. ఎంపీగా చెల్లుబాటు కాదని లోక్‌ సభ సెక్రెటరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. సూరత్‌ కోర్టు వేసిన రెండేళ్ల జైలు శిక్షతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మోదీ ఇంటిపేరు మీద 2019 ఎన్నికల్లో కర్ణాటకలో రాహుల్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యల విషయంలో అతనిపై సూరత్‌ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. దీంతో కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినత్య చట్టం 1951 సెక్షన్‌8 ప్రకారం ఏదైనా కేసులో దోషిగా రెండేళ్లు శిక్షపడితే చట్ట సభ్యులు సభ్యత్వం కోల్పోతారు. శిక్షాకాలంతో పాటు మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోతారు. ఈ నేపథ్యంలో సూరత్‌ కోర్టు తీర్పు ఆధారంగా లోక్‌ సభ రాహుల్‌ను అనర్హున్ని చేసింది.

Tags

Read MoreRead Less
Next Story