బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.42,500

బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.42,500
సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 100 ఖాళీలను భర్తీ చేస్తోంది. బీటెక్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

ఢిల్లీ, ఒడిషా, జార్ఖండ్‌లలో ఈ ఖాళీలు ఉన్నాయి. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబర్ 15 దరఖాస్తుకు చివరి తేదీ.

మొత్తం ఖాళీలు: 100

ఇంజనీర్ (సివిల్)-80

ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-20

విద్యార్హతలు: ఇంజనీర్ (సివిల్) పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులు కావాలి. ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు ఎలక్ట్రల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతతో పాటు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.550. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులకు ఫీజు లేదు.

జీతం: రూ.42,500

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: General Manager (HRM), NBCC (I) Limited, NBCC Bhawan, 2nd Floor, Corporate Office, Near Lodhi Hotel, Lodhi Road, New Delhi-110003.

వెబ్‌సైట్:https://www.nbccindia.com

Tags

Read MoreRead Less
Next Story