జాతీయం

ఓటీటీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

ఓటీటీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటీటీలో ప్రసారమవుతున్న కొన్ని కార్యక్రమాల్లో పోర్నోగ్రఫీ ఉంటోందని అసహనం వ్యక్తం చేసింది.

ఓటీటీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!
X

ఓటీటీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటీటీలో ప్రసారమవుతున్న కొన్ని కార్యక్రమాల్లో పోర్నోగ్రఫీ ఉంటోందని అసహనం వ్యక్తం చేసింది. ఆయా ప్రోగ్రామ్‌లను ముందే స్క్రీనింగ్‌ చేసి... ఆ తర్వాత ప్రేక్షకుల ముందు పెట్టాలని సుప్రీం ఆదేశించింది. ఓటీటీలపై ఉన్న మార్గదర్శకాలేంటో కేంద్రం.... కోర్టుకు తెలపాలని సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. 'ప్రస్తుతం ఓటీటీ, ఇంటర్నెట్‌లో సినిమాలు చూడటం సర్వసాధారణం... మా అభిప్రాయం ప్రకారం కొన్నింటిని కట్టిడి చేయాల్సి ఉంది.. పోర్నోగ్రఫీని కూడా ప్రసారం చేస్తున్నారు' అంటూ జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం పేర్కొంది.

Next Story

RELATED STORIES