దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ అధికారులు

దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ అధికారులు
దేశంలో భారీ ఉగ్రకుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు.

దేశంలో భారీ ఉగ్రకుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్, కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం నగరాల్లో ఆకస్మిక దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు.. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న 9 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరంతా ముర్షిదాబాద్, ఎర్నాకుళం కేంద్రాలుగా నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా కోసం పనిచేస్తున్నారని దర్యాప్తులో తేలింది.

వారి నుంచి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజులు, జిహాది సాహిత్యం, ఆయుధాలు, కంట్రీమేడ్ తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఢిల్లీ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు కుట్రపన్నుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఎన్ఐఏ అధికారి తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో శనివారం చేసిన ఆకస్మిక దాడుల్లో వీరంతా పట్టుబట్టారు. ముర్షిదాబాద్ లో ఆరుగురు, ఎర్నాకుళంలో ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story