చదువు పూర్తయ్యాక కాఫీక్లబ్‌లో వారానికి రూ.1000లకు... : నిహారిక

చదువు పూర్తయ్యాక కాఫీక్లబ్‌లో వారానికి రూ.1000లకు... : నిహారిక
అందుకే కాఫీడేలో పని చేస్తానని చెప్పేసరికి మొదట నాన్న

మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన స్వీట్ బ్యూటీ నిహారిక కొణిదెల కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. చైతన్యకు సరిజోడిగా వివాహ బంధాన్ని ఆస్వాదిస్తోంది. ఇండస్ట్రీలోకి రాకముందు చదువు పూర్తయిన తరువాత నిహారిక తండ్రితో చెప్పిందట.. విభిన్నమైన మనుషులను కలవాలని.. సంస్కృతుల గురించి తెలుసుకోవాలని ఉదని.. అందుకే కాఫీడేలో పని చేస్తానని చెప్పేసరికి మొదట నాన్న తటపటాయించినా ఆ తరువాత ఓకే అన్నారు. అలా ఫిల్మ్‌నగర్ కాఫీ క్లబ్‌లో పని చేశాను అని చెప్పింది. అక్కడ వారానికి రూ.1000లు ఇచ్చేవాళ్లు. అదే నా తొలి సంపాదన.

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ఏరోజూ నటిని కావాలి అనుకోలేదు. అనుకోకుండా ఓసారి షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. నిజానికి ఆ పాత్రలో వేరే అమ్మాయి నటించాలి. ఆమె చేయననడంతో చివరికి ఆ పాత్ర నేను చేయాల్సి వచ్చింది. అందులో నా నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఆ తరువాత బుల్లి తెరపై ఢీ జూనియర్స్‌లో వ్యాఖ్యాతగా అవకాశం వచ్చింది.

కొత్తలో కెమెరా అంటే కొంచెం భయంగా అనిపించినా నాన్న ప్రోత్సాహంతో సక్సెస్‌ఫుల్‌గా ఆ షో చేశానని చెప్పింది. ఓ రోజు సడెన్‌గా నాన్నతో సినిమాల్లో నటిస్తానని చెప్పా.. కుటుంబసభ్యులు మొదట షాకైనా.. తరువాత నా ఇష్టాన్ని ఎవరూ కాదనలేదు. పెదనాన్న చిరంజీవి సినిమా అంజీ‌లో నటించినప్పుడు నా వయసు నాలుగేళ్లు.

కానీ ఆ తరువాత కథలో కొన్ని మార్పులు చేశారు. అప్పుడు కొంచెం పెద్ద వయసు పిల్లలు అయితే బాగుంటుందని భావించి నేను నటించిన సన్నివేశాలు తొలగించారు. అయితే ఆ సినిమా షూటింగ్ సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. చిన్నప్పుడు నా కళ్లు కొంచెం చిన్నగా ఉండేవి.. పవన్ బాబాయ్ నా కళ్లను చూసి జపాన్ పిల్ల అని ఏడిపించేవాడు.. అవన్నీ గుర్తొస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చిన్ననాటి సంగతులను చెప్పుకొచ్చింది నిహారిక.

Tags

Read MoreRead Less
Next Story