Nine new judges : సుప్రీంకోర్టులో నవ న్యాయమూర్తుల ప్రమాణం..!

Nine new judges : సుప్రీంకోర్టులో నవ న్యాయమూర్తుల ప్రమాణం..!
సుప్రీంకోర్టులో నవ న్యాయమూర్తులు కొలువుదీరారు.. కొత్తగా 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేశారు.

సుప్రీంకోర్టులో నవ న్యాయమూర్తులు కొలువుదీరారు.. కొత్తగా 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేశారు. కొత్త న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. కరోనా ప్రభావం కారణంగా ఈసారి ప్రమాణస్వీకార వేదికను మార్చారు. 1వ కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా.. అదనపు భవనం ఆడిటోరియంలో నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ఎక్కువ స్థలం కోసం అక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు.

మొదటిగా జస్టిస్‌ అభయ్‌ ఓకా న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.. ఆ తర్వాత విక్రమ్‌నాథ్‌, జేకే మహేశ్వరి, హిమా కోహ్లీ, నాగరత్న, రవికుమార్‌, సుందరేష్‌ మాధుర్య త్రివేది, శ్రీనరసింహ న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. ఇక సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి న్యాయమూర్తుల ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం మాత్రమే ప్రత్యక్ష ప్రసారమయ్యేది. కానీ, తొలిసారిగా న్యాయమూర్తుల బాధ్యతల స్వీకారం కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. అదీకాక ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయడం కూడా ఇదే మొదటిసారి.

కొత్తగా 9 మంది బాధ్యతలు స్వీకరించగా.. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. సుప్రీం కోర్టుకు కొత్త జడ్జిగా నియమితులైన జస్టిస్‌ హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు.

Tags

Read MoreRead Less
Next Story