మిస్టర్ కూల్‌కి మండింది.. తేజస్వీపై ఫైర్

మిస్టర్ కూల్‌కి మండింది.. తేజస్వీపై ఫైర్
అతడు నాకు స్నేహితుడి కొడుకు కాబట్టి నేను వింటూనే ఉన్నాను. నేను ఏమీ అనను. తన తండ్రిని శాసనసభకు నాయకుడిని చేసినది

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం అసెంబ్లీలో తేజశ్వి యాదవ్‌పై విరుచుకు పడ్డారు. తన సహనాన్ని కోల్పోయి తేజస్విపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ కూల్‌గా పేరున్న నితీశ్ ప్రతిపక్ష నేత తేజస్వీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

"అర్ధం లేకుండా మాట్లాడుతున్నావు, అబద్ధం చెబుతున్నావు" అని సీఎం నితీశ్.. తేజస్విని ఉద్దేశించి అన్నారు. అతడు నాకు స్నేహితుడి కొడుకు కాబట్టి నేను వింటూనే ఉన్నాను. నేను ఏమీ అనను. తన తండ్రిని శాసనసభకు నాయకుడిని చేసినది ఎవరో ఆయనకు తెలుసా? అతన్ని ఉప ముఖ్యమంత్రిగా ఎవరు చేశారు? అని నితీశ్ అన్నారు. తేజస్వీ ఎన్నికల ప్రచారంలో తన తండ్రి లాలూ యాదవ్‌పై తీవ్ర దాడి చేసినందుకు ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా అసెంబ్లీలో మాట్లాడినందుకుగాను ముఖ్యమంత్రి నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా సభను 30 నిమిషాలపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. తరువాత సభ తిరిగి ప్రారంభమైనప్పుడు, కొత్తగా ఏర్పడిన అసెంబ్లీకి గవర్నర్ల ప్రసంగంపై చర్చకు ప్రభుత్వం తరపున సమాధానం ఇస్తూ నితీష్ కుమార్ ప్రసంగించారు. ప్రతిపక్షాలు తన ఆకాంక్షలను కలిగి ఉండటానికి అర్హత కలిగి ఉన్నాయని, అయితే 'మర్యాద' (డెకోరం) ఎప్పుడూ ఉల్లంఘించరాదని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story