జాతీయం

Odisha Extends Lockdown : ఒడిశాలో లాక్ డౌన్ పొడిగింపు.. !

Odisha Extends Lockdown : కొవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు ఒడిశా అమలు చేస్తున్న లాక్ డౌనను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది.

Odisha Extends Lockdown : ఒడిశాలో లాక్ డౌన్ పొడిగింపు.. !
X

Odisha Extends Lockdown : కొవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు ఒడిశా అమలు చేస్తున్న లాక్ డౌనను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. మే 19వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ లా డౌన్ కొనసాగుతుందని తెలిపింది. వారాంతంలో పూర్తి లాక్ డౌన్ ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల లాక్ డౌన్ ఈనెల 19తో ముగుస్తున్నందున, కరోనా కట్టడికి లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇది శుక్రవారం సాయంత్రం 6గంటలకు మొదలై సోమవారం ఉదయం 5గంటల వరకు అమలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఆ రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 10,321 కొత్త కేసులు, 22 మరణాలు వెలుగుచూశాయి. ప్రస్తుతం 1,04,539 యాక్టివ్‌ కేసులున్నాయి.

Next Story

RELATED STORIES