మీకు పాన్ కార్డ్ ఉందా..? అయితే అలర్ట్‌ అవ్వాల్సిందే!

మీకు పాన్ కార్డ్ ఉందా..? అయితే అలర్ట్‌ అవ్వాల్సిందే!
మరో ఆరు రోజుల్లో ఆధార్, పాన్ అనుసంధానానికి తుది గడువు ముగిసిపోతుంది.

మీకు పాన్ కార్డ్ ఉందా..? అయితే అలర్ట్‌ అవ్వాల్సిందే.. మీ పాన్‌ను మీ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే ఇక అంతే. పాన్ కార్డు వచ్చే నెల నుండి పనికిరాకుండా పోవచ్చు.? పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మళ్లీ గడువును పొడిగించక పోవచ్చు! ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్ చేయడానికి ఈ నెల 31 వరకు గడువు విధించింది కేంద్రం. దీంతో ఈ నెలాఖరు తర్వాత ఆధార్‌తో అనుసంధానించలేని పాన్ కార్డులన్నీ పనికిరానివిగా మారే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 1 నుండి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.

మరో ఆరు రోజుల్లో ఆధార్, పాన్ అనుసంధానానికి తుది గడువు ముగిసిపోతుంది. అప్పటిలోగా రెండింటిని అనుసంధానం చేయించకపోతే పాన్ చెల్లదు. అంతేకాకుండా వెయ్యి వరకు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 272-B ప్రకారం జరిమానా విధించే అవకాశం ఉంది. లోక్‌సభ మంగళవారం ఆమోదించిన ఆర్థిక బిల్లులో ఈ నిబంధనలు చేర్చారు.

కొందరు నిర్లక్ష్యంతో పాన్‌, ఆధార్‌ లింక్‌ చేయడంలేదని.. మరికొందరు అక్రమార్జన చేసేవారు రెండు, మూడు పాన్‌ కార్డులు కూడా తీసకుని ఉంటారని కేంద్రం భావిస్తోంది. అటువంటి వారు కూడా ఆధార్‌ జత చేయడంలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అక్రమాలు అరికట్టడానికే ఆధార్‌, పాన్‌ నంబర్‌ లింక్‌ చేయాలనే నిబంధన తెచ్చింది కేంద్రం.

Tags

Read MoreRead Less
Next Story