రైలు ప్రయాణీకులకు శుభవార్త.. టికెట్ లేకుండానే రెలెక్కేయొచ్చు..

రైలు ప్రయాణీకులకు శుభవార్త.. టికెట్ లేకుండానే రెలెక్కేయొచ్చు..
చివరి నిమిషంలో రైల్వే స్టేషన్‌కు వచ్చి హైరానా పడకుండా ఉండేందుకే భారత రైల్వే శాఖ ఈ వెసులుబాటు కల్పించింది.

అర్జెంట్‌గా ఊరెళ్లాల్సిన పని పడింది. ఆదరా బాదరాగా బ్యాగు సర్థుకుని రైల్వే స్టేషన్‌కి వస్తే చాంతాడంత క్యూ.. అయ్యో టిక్కెట్ దొరుకుతుందో లేదో.. ఇప్పుడెలా అని అస్సలు అనుకోవాల్సిన పనిలేదు. ఎంచక్కా ప్లాట్‌ఫాం టికెట్ తీసుకుని రైలెక్కేయండి.. టీసీ వచ్చినప్పుడు ఆ టికెట్ చూపిస్తే మీకు టికెట్ ఇస్తారు.

ఒకవేళ బెర్త్ ఏమైనా ఉంటే అది కూడా కన్ఫామ్ చేస్తారు. యూటీస్ యాప్ ద్వారా లేదా స్టేషన్‌లోని వెండింగ్ మెషీన్ ద్వారా ప్లాట్‌ఫాం టికెట్ తీసుకుంటే సరిపోతుంది. చివరి నిమిషంలో రైల్వే స్టేషన్‌కు వచ్చి హైరానా పడకుండా ఉండేందుకే భారత రైల్వే శాఖ ఈ వెసులుబాటు కల్పించింది.

భారతీయ రైల్వే ప్రయాణికులు ప్లాట్‌ఫాం టికెట్లతో కూడా రైలులో ప్రయాణించడానికి అనుమతించింది. అత్యవసర పరిస్థితి కోసం రైలు ఎక్కాల్సిన ప్రయాణీకుడు ఇప్పుడు ప్లాట్‌ఫాం టికెట్‌తో ప్రయాణించవచ్చు.

నిబంధన ప్రకారం, ప్లాట్‌ఫాం టికెట్‌తో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టిటిఇ) వచ్చినప్పుడు అతడు చేరుకోవలసిన గమ్య స్థానం గురించి తెలియజేయాలి. టిటిఇ అప్పుడు టికెట్ ఇస్తారు.

ఒకవేళ, మీకు రిజర్వ్డ్ సీటు లభించకపోతే, మీ గమ్యం టికెట్ ఖర్చుతో పాటు 250 రూపాయల జరిమానా వసూలు చేయవచ్చు. రైల్వే ప్రయాణీకులకు రెండు రకాల రిజర్వేషన్ బుకింగ్ గురించి తెలుసు. ఆన్‌లైన్ ద్వారా ఒకటి, మరొకటి తత్కాల్ టిక్కెట్లు.

రైల్వే శాఖ నివేదిక ప్రకారం 2020-21లో రైల్వేల ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనావైరస్ సంక్షోభం కారణంగా స్టేషన్లలోకి ప్రవేశించడానికి విధించిన ఆంక్షల కారణంగా గత సంవత్సరంతో పోల్చితే రైల్వే ఆదాయం 94 శాతం తగ్గింది. ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల అమ్మకం ద్వారా 2020-21లో ఫిబ్రవరి వరకు రూ.10 కోట్లు సంపాదించినట్లు ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story