మోదీ ఇచ్చే రూ.6,000 అకౌంట్లో పడాలంటే ఈ డాక్యుమెంట్లు కంపల్సరీ.. !

అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది పీఎం కిసాన్ స్కీమ్.. రైతులకి ఆర్ధికంగా సహాయం చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని ఆవిష్కరించింది.

మోదీ ఇచ్చే రూ.6,000 అకౌంట్లో పడాలంటే ఈ డాక్యుమెంట్లు కంపల్సరీ.. !
X

అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది పీఎం కిసాన్ స్కీమ్.. రైతులకి ఆర్ధికంగా సహాయం చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్రం రూ. 6 వేలను ఇస్తుంది. అయితే ఈ డబ్బులను కేంద్రం మొత్తం మూడు విడతల్లో రైతులకు అందజేస్తోంది. అయితే ఇక పైన ఈ స్కీమ్ కింద డబ్బులు పొందాలంటే కచ్చితంగా ఈ డాక్యుమెంట్లను కలిగి ఉండాలి.

వీటిల్లో ఒకటి ఆధార్ కార్డు.. ఇది అందరి దగ్గర కచ్చితంగా ఉంటుంది కాబట్టి పెద్ద సమస్యేం లేదు. దీనితో పాటుగా పొలం పట్టా పాస్ బుక్ కూడా ఉండాలి. అయితే ఈ పాస్ బుక్ కూడా కచ్చితంగా లబ్ధిదారుడి పేరు మీదనే ఉండాలి. అలా అయితేనే రైతులకి పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. లేదంటే లేదు. అంతేకాకుండా పూర్వీకుల పొలంలో వాటా కలిగిన వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు ఇక రావు. కాగా, కొత్తగా ఈ స్కీమ్‌లో చేరాలని అనుకునే వారు ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, పొలం పట్టా వంటి డాక్యుమెంట్లు కలిగి ఉండాలి.

Next Story

RELATED STORIES