హత్రాస్ ఘటనపై సీఎం యోగికి కాల్ చేసిన ప్రధాని మోదీ

X
By - shanmukha |30 Sept 2020 1:52 PM IST
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న హత్రాస్ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీ యూపీ సీఎం యోగీ
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న హత్రాస్ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. ఎట్టి పరిస్తితుల్లో కూడా దోషులను విడిచిపెట్టొద్దని ఆదేశించారు. ప్రధాని మోదీ కాల్ చేసి మాట్లాడిన విషయాన్ని సీఎం యోగీ తెలిపారు. ఈ విషయంపై ముగ్గురు సభ్యులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేశామని.. ఏడు రోజుల్లో ఈ ప్యానెల్ రిపోర్టు సమర్పిస్తుందని సీఎం యోగి తెలిపారు.
యూపీకి చెందిన మనీషా వాల్మీకి అనే యువతిని నలుగురు కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. తరువాత ఆ యువతి మృత దేహాన్ని పోలీసులు బలవంతంగా దహనం చేశారని స్థానికులు ఆరోపించారు. ఆ సమయంలో అడ్డుకున్న కుటుంబ సభ్యులను ఇంట్లో పెట్టి తాళం వేశారని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com