Narendra Modi : కరోనా, టీకా డ్రైవ్‌పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష..!

Narendra Modi : కరోనా, టీకా డ్రైవ్‌పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష..!
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించారు.

దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించిన ఆయన.. దేశంలో టెస్టుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. సెకండ్ వేవ్ లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు వస్తున్నాయని.. గ్రామీణ ప్రాంతల్లో టెస్టులు పెంచాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. ఇందుకోసం ఆశా, అంగన్ వాడీ వర్కర్ల సేవలు ఉపయోగించుకోవాలని మోదీ సూచించారు. అటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గడిచిన 24 గంటల్లో 3,26,098 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 3,53,299 దిశ్కార్జ్ కాగా, 3,890 మరణాలు నమోదయ్యాయి. మరో వైపు తౌక్టే తుఫాను నేపథ్యంలో చేపట్టిన చర్యలపై సైతం సాయంత్రం 5 గంటలకు ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story