జాతీయం

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

‌మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ 87 సంవత్సరాలు పూర్తి చేసుకొని.. 88వ సంవత్పరంలో అడుగుపెట్టారు

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
X

‌మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ 87 సంవత్సరాలు పూర్తి చేసుకొని.. 88వ వసంతంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్న అని ట్వీట్ చేశారు. అటు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా మన్మోహన్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రులు మనకు చాలా తక్కువమంది కనిపిస్తారని.. ఆయన మన అందరికి స్పూర్తి అని ట్వీట్ చేశారు. గాంధీ, నెహ్రూ కుటుంబేతర కాంగ్రెస్ ప్రధానుల్లో ఎక్కువ కాలం పని చేసిన నేతగా పేరుగాంచారు. ఒక ఆర్థికవేత్తగా ఉంటూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి.. రెండు సార్లు ప్రధాని పదవిని చేపట్టారు. ఆర్థిక మంత్రిగా ఉంటూ దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజం వేశారు.

Next Story

RELATED STORIES