గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం శుభవార్త..!

గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం శుభవార్త..!
ఉజ్వల 2.0 పథకం కింద లబ్దిదారులకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందించే కార్యక్రమాన్ని దేశ ప్రధాని మోదీ మంగళవారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో జరిగిన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు

గ్యాస్ వినియోదరులకి కేంద్రం శుభవార్తను చెప్పింది. ఉజ్వల 2.0 పథకం కింద లబ్దిదారులకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందించే కార్యక్రమాన్ని దేశ ప్రధాని మోదీ మంగళవారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో జరిగిన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎంయూవై పథకం కింద మరో కోటి గ్యాస్‌ కనెక్షన్లను ఇవ్వనున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. తొలి విడతలో ఎల్‌పీజీ కనెక్షన్లు పొందలేక పోయిన పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉజ్వల స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం కనీస ప్రతాలు అవసరమే కానీ ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే గ్యాస్ కనెక్షన్లు అందించనుంది. కాగా 2016లో ఉజ్వల 1.0 కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌ బల్లియా నుంచి ప్రారంభించారు. ఇందులో 80లక్షల ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లను అందించారు.


Tags

Read MoreRead Less
Next Story