గవర్నర్లతో నేడు సమావేశం కానున్న ప్రధాని, రాష్ట్రపతి

గవర్నర్లతో నేడు సమావేశం కానున్న ప్రధాని, రాష్ట్రపతి
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయవిద్యా విధానంపై రాష్ట్రాల గవర్నలతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ప్రధాని

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయవిద్యా విధానంపై రాష్ట్రాల గవర్నలతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు వీడియో కాన్షరెన్స్ ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాన్ని 'ఉన్నత విద్య రూపాంతరంలో ఎన్‌ఈపీ-2020 పాత్ర' పేరుతో నిర్వహిస్తారు. ఈ సమావేశంలో గవర్నర్లతో పాటు విద్యాశాఖ మంత్రులు, యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు హాజరవుతారు. నూతన విద్యావిదానం లక్ష్యాలు, ఆశయాల గురించి చర్చిస్తారు. ప్రపంచంలో భారత్ సూపర్ పవర్ గా ఎదగడానికి నూతన విద్యావిధానం ఏ విధంగా ఉపయోగపడుతుందో చర్చకురానుంది. దీనికోసం దేశ వ్యాప్తంగా వెబినార్లు, వర్చువల్‌ సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story