కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకుని మోసం.. బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీకపై కేసు నమోదు

కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకుని మోసం.. బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీకపై కేసు నమోదు
52 ఎకరాల స్థలాన్ని రూ.35 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు.

బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీకపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఉదయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన దొరస్వామి రోడ్ నెంబర్ 10లో టచ్ స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆయనకు టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ ఎండీ శ్రీధర్‌తో 20 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. సంస్థను విస్తరించే దిశగా నగర శివారులో భూమి కొనుగోలుకు అన్వేషిస్తున్నట్లు దొరస్వామి స్నేహితుడు శ్రీధర్‌కు చెప్పారు. భూముల కొనుగోళ్లకు సంబంధించిన వ్యాపారస్తులు తనకు చాలా మంది తెలుసునని అందులో కత్తి కార్తీక నిర్వహిస్తున్న గ్రూప్ కూడా ఒకటిని శ్రీధర్.. దొరస్వామి చెప్పాడు. దీంతో ఏప్రిల్ నెలలో కార్తీక, నువ్వాల శివరాంప్రసాద్, తెన్నేరి భీమ్‌సేన్‌ను దొరస్వామి కలిసి భూమి కావాలని చెప్పారు.

కత్తీ కార్తీక బృందం మెదక్ జిల్లా అమీన్‌పూర్ గ్రామంలో కొన్ని భూములు దొరస్వామికి చూపించింది. గ్రామంలోని సర్వే నెంబర్లు 322,323,324,329లలో 52 ఎకరాల స్థలం ఉందని అందులో కొంత స్థలం తమదేనని, మిగతా స్థలం తాలూకు పత్రాలు జీపీఏ హక్కులు తమ వద్ద ఉన్నాయని కార్తీక బృందం తెలిపింది. 52 ఎకరాల స్థలాన్ని రూ.35 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా దొరస్వామి.. కార్తీకకు కోటి రూపాయలు ఇచ్చారు. కానీ కార్తీక గ్రూప్ దొరస్వామికి అమ్మిన స్థలం నాదంటూ సిప్లా రమేష్ అనే వ్యక్తి రంగంలోకి దిగారు. మోసపోయానని గ్రహించిన దొరస్వామి.. కత్తి కార్తీకతో పాటు గ్రూప్ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కార్తీక స్వతంత్ర అభ్యర్థిగా దుబ్బాక ఉప ఎన్నికకు పోటీ పడుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story