బోయినపల్లి మార్కెట్ పై మోదీ ప్రశంసలు!

బోయినపల్లి మార్కెట్ పై మోదీ ప్రశంసలు!
కొత్త సంవత్సరంలో ప్రధాని మోదీ తొలి మాన్ కీ బాత్ కార్యక్రమంలో పలు విషయాలను ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ భారత్ లో జరుగుతోందని మోదీ తెలిపారు.

కొత్త సంవత్సరంలో ప్రధాని మోదీ తొలి మాన్ కీ బాత్ కార్యక్రమంలో పలు విషయాలను ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ భారత్ లో జరుగుతోందని మోదీ తెలిపారు. కేవలం 15 రోజుల్లో 30లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు అందించామన్నారు. అదే అమెరికాలో 18 రోజుల పట్టగా.. బ్రిటన్ కు 36 రోజులు పట్టిందని చెప్పారు.

స్వదేశీ వ్యాక్సిన్ తయారుచేసి ఇతర దేశాలకు కూడా పంపిణీ చేయడం దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. అనంతరం రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ఎర్రకోటపై భారతీయ జెండాకు అవమానం జరగడంపై దేశం దిగ్బ్రాంతికి గురైందన్నారు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ కైవసం చేసుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ లోని బోయినపల్లి మార్కెట్ యార్డుపై మోదీ ప్రశంసలు కురిపించారు. కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రతిరోజూ 10 టన్నుల చెత్త నుంచి 500 యూనిట్ల విద్యుత్, 30 కేజీల బయో ఫ్యూయల్ ఉత్తత్తి చేస్తున్నారని తెలిపారు.

ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్ ను బోయినపల్లి మార్కెట్ లో ఉపయోగించడంతో పాటు బయో ఫ్యూయల్ ద్వారా క్యాంటీన్ లోని ఆహారాన్ని వండుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ దేశ ప్రజలందరికీ ఎంతో ఆదర్శనీయమని ప్రధాని కొనియాడారు

Tags

Read MoreRead Less
Next Story