Priyanka Gandhi : యూపీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిపై వచ్చిన క్లారిటీ.!

Priyanka Gandhi : యూపీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిపై వచ్చిన క్లారిటీ.!
Priyanka Gandhi : యూపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. బీజేపీకి యోగి, సమాజ్‌వాదీ పార్టీ కూటమికి అఖిలేష్‌ యాదవ్‌ సీఎం అభ్యర్థులుగా ఉన్నారు.

Priyanka Gandhi : యూపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. బీజేపీకి యోగి, సమాజ్‌వాదీ పార్టీ కూటమికి అఖిలేష్‌ యాదవ్‌ సీఎం అభ్యర్థులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది. తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పెద్ద హింట్‌ ఇచ్చారు. పార్టీ యూత్‌ మేనిఫెస్ట్‌ విడుదల చేసిన ప్రియాంక గాంధీ.. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు.. ఇంకెవరైనా కన్పిస్తున్నారా? మరి ఇంకేంటీ? ఎక్కడ చూసినా నేనే కన్పిస్తున్నానుగా..! చూడట్లేదా?'' అన్నారు ప్రియాంక గాంధీ. అయితే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ మాటలతో యూపీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ప్రియాంక గాంధీనే అన్న విషయాన్ని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగాలకు ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు.

Tags

Read MoreRead Less
Next Story