తేయాకు తోటల్లో పనిచేసిన ప్రియాంక గాంధీ

తేయాకు తోటల్లో పనిచేసిన ప్రియాంక గాంధీ
బిశ్వనాథ్ ప్రాంతంలోని సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లిన ప్రియాంక.. అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు.

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అసోంలో గత ఎన్నికలు హస్తం పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దెదించి బిజెపి అక్కడ కాషాయ జెండా ఎగురవేసింది. దీంతో పూర్వవైభవం కోసం రంగంలోకి దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించారు.

ప్రచారంలో భాగంగా బిశ్వనాథ్ ప్రాంతంలోని సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లిన ప్రియాంక.. అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. తలకు బుట్టవేసుకుని తేయాకు తెంపారు. అనంతరం తోట పక్కనే కూర్చొని కూలీలతో ముచ్చటించారు. తేయాకు కూలీలు అసోంతో పాటు మన దేశానికి ఎంతో విలువైనవారని ప్రియాంక అన్నారు.

తేయాకు కూలీలకు గుర్తింపు తెచ్చేందుకు, అసోం ప్రజల హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పోరాడుతూనే ఉంటుందని ప్రియాంక గాంధీ తెలిపారు.



Tags

Read MoreRead Less
Next Story