ప్రొటీన్ కోసం గుడ్డే తినాలని ఏం ఉంది.. ఇవి కూడా తినొచ్చు..

ప్రొటీన్ కోసం గుడ్డే తినాలని ఏం ఉంది.. ఇవి కూడా తినొచ్చు..
గుడ్డును మించిన ఆహార పదార్ధాలెన్నో ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు.

ఎదిగే పిల్లలకు, ఆ మాటకొస్తే పెద్దవారికి కూడా ప్రొటీన్ చాలా అవసరం. మరి ప్రొటీన్ శరీరానికి సమృద్ధిగా లభించాలంటే రోజుకో గుడ్డు తినాలంటారు.. గుడ్డు తినని వాళ్ల పరిస్థితి ఏంటి.. ఎందులో ఉంటాయి ప్రొటీన్లు అంటే.. గుడ్డును మించిన ఆహార పదార్ధాలెన్నో ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవి..

సోయాబీన్.. శాచురేటెడ్ కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. వీటిలో విటమిన్ సి, ప్రొటీన్, ఫోలేట్ అధికంగా లభిస్తాయి. ఒక కప్పు వండిన సోయాబీన్‌తో 28 గ్రాముల ప్రొటీన్ పొందొచ్చు.

గుమ్మడి గింజలు.. చాలా మంది వీటిని తక్కువ అంచనా వేస్తారు కానీ వీటిలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. కేవలం 30 గ్రాముల గింజలు తింటే చాలు 9 గ్రాముల ప్రొటీన్ అందుతుంది.

వేరు శెనగ గింజలు.. ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. గుప్పెడు గింజలు తింటే 7 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.

శెనగలు.. ఒక కప్పు ఉడకబెట్టిన శనగలను తింటే 12 గ్రాముల ప్రొటీన్ శరీరానికి అందుతుంది. ఇంకా ఇనుము, ఫాస్నేట్, కాల్షియం, మెగ్నిషియం, జింక్, విటమిన్-కె కూడా లభిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story