Amarinder Singh : అమరీందర్ సింగ్ కొత్త పార్టీ.. బీజేపీతో పొత్తు..!

Amarinder Singh : అమరీందర్ సింగ్ కొత్త పార్టీ.. బీజేపీతో పొత్తు..!
Amarinder Singh : ఇటీవల పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Amarinder Singh : ఇటీవల పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సంసిద్ధం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలను, వ్యక్తులను కలుపుకుపోతామని స్పష్టం చేశారు. త్వరలోనే తమ పార్టీకి సంబంధించిన విధివిధానాలను వెల్లడిస్తానని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. ఆయన కేంద్రమంత్రి అమిత్ షాతో భేటి అవ్వడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

కానీ ఆయన అనూహ్యంగా కొత్త పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించడం అందరిని ఆశ్చరానికి గురిచేసింది. పంజాబ్ రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న 79 ఏళ్ల అమరీందర్ సింగ్.. దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటుగా కాంగ్రెస్‌‌లో కొనసాగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఇవ్వడం పట్ల అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పరిణామంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం చరణ్ జిత్ సింగ్ చన్నీని కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story