వంటల ఛానల్ లో రాహుల్ గాంధీ.. ఏం చేశారంటే!

వంటల ఛానల్ లో రాహుల్ గాంధీ.. ఏం చేశారంటే!
తమిళనాడు రాష్ట్రంలో విలేజ్ కుకింగ్ ఛానల్ కు మంచి ఆదరణ ఉంది. కొన్ని లక్షల మంది ఈ ఛానల్ వీక్షిస్తుంటారు. రెండు సంవత్సరాల కింద మొదలైన ఈ ఛానల్ కి 70 లక్షలకి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో అన్నీ రాజకీయ పార్టీలు తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అక్కడ విస్తృతంగా పర్యటించారు. పలు రోడ్ షోలు కూడా నిర్వహించారు. అయితే తాజాగా అయన ఓ వంటల ఛానల్ లో కనిపించడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమయింది.

తమిళనాడు రాష్ట్రంలో విలేజ్ కుకింగ్ ఛానల్ కు మంచి ఆదరణ ఉంది. కొన్ని లక్షల మంది ఈ ఛానల్ వీక్షిస్తుంటారు. రెండు సంవత్సరాల కింద మొదలైన ఈ ఛానల్ కి 70 లక్షలకి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సహజ సిద్దంగా వంటలు చేయడం ఈ ఛానల్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మష్ రూమ్ బిర్యానీతో పాటు అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు ఇక్కడ నోరూరిస్తాయి.

అయితే ప్రస్తుతం తమిళనాడులోనే ఉన్న ఉన్న రాహుల్ గాంధీ ఈ ఛానల్ యొక్క బృందాన్ని కలిశారు. అక్కడ మష్ రూమ బిర్యానీ తయారీ విధానాన్ని చూసి నేర్చుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి ఆ బిర్యానీ రుచి చూశారు. బిర్యానీ బాగుందంటూ తమిళ్ లో అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా గంటల వ్యవధిలో 5లక్షల మంది చూడడం విశేషం. ఇందులో రాహుల్ గాంధీతో పాటుగా కరూర్ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ), కాంగ్రెస్ నాయకుడు జోతిమణి కూడా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story