నాన్నా.. మనకెందుకీ రాజకీయాలు.. వద్దు పప్పా..!!

నాన్నా.. మనకెందుకీ రాజకీయాలు.. వద్దు పప్పా..!!
భ్రష్టు పట్టి పోయిన పాలిటిక్స్‌ని మార్చగలరా.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించగలరా.. ఏదో చేద్దామని వస్తారు..

సినిమాల్లో సూపర్ స్టార్.. ఆ ఇమేజ్ అలాగే ఉంచుకోకూడదు.. ఈ వయసులో పాలిటిక్స్ అవసరమా.. అదీ కాక ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. బ్లడ్ ప్రెషర్‌లో హెచ్చుతగ్గులు.. ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపన.. రాజకీయాల్లోకి వస్తేనే సాధ్యమవుతుందా.. సినిమాల్లో ఉండి కూడా చేయొచ్చు కదా..

తాజాగా సోనూ సూద్‌ కూడా తన వంతు సాయం చేస్తున్నాడు కదా.. భ్రష్టు పట్టి పోయిన పాలిటిక్స్‌ని మార్చగలరా.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించగలరా.. ఏదో చేద్దామని వస్తారు.. ఆఖరికి ఉన్నదీ పాయె.. ఉంచుకున్నదీ పాయె అన్న చందంగా తయారవుతున్నారు సినిమా నటీ నటులు.. అందరూ క్లిక్ అవ్వరు.. అందునా ప్రస్తుత పరిస్థితుల్లో.. రజనీ రాజకీయాల్లోకి వస్తానంటే అందరూ అనుకునే మాట ఇది..

సొంత బిడ్డలు కూడా ఇదే మాట అంటున్నారు.. రాజకీయాల్లోకి వెళ్లొద్దు పప్పా అని బతిమాలుతున్నారు రజనీ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు. ఇటీవల హైదరాబాద్‌లో 'అన్నాత్తై' చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుపుతున్న సమయంలో రజనీ అనారోగ్యానికి గురయ్యారు.

బీపీ హెచ్చుతగ్గులు రావడంతో ఇక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. శనివారం డిశ్చార్జ్ అనంతరం చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు ఆయనతో రాజకీయాల గురించి మాట్లాడారు. జనవరి 31న పార్టీకి సంబంధించిన వివరాలు ప్రకటించనున్నందున నిత్యం అవే ఆలోచనలు చేస్తున్నారని, అందువల్లనే మానసిక ఒత్తిడికి గురై ఆరోగ్యం పాడైందని భావించి తండ్రిని రాజకీయాలకు దూరంగా ఉండమని విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని నిర్ణయించుకున్నట్టు రజినీ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రజనీ పార్టీ వ్యవహారాలు చూసుకునే తమిళరువి మణియన్ జనవరి 31న యధాతథంగానే పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. రజనీ మక్కల్ మండ్రం నిర్వాహకులు మాట్లాడుతూ.. రజనీకాంత్ సభలకు ప్రత్యక్షంగా హాజరుకానున్నా ఆయన పార్టీ ప్రకటన విడుదల చేస్తే చాలని అంటున్నారు. మరి రజినీకాంత్ ఎలా స్పందిస్తారో, పార్టీ పేరు ఎలా ప్రకటిస్తారో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story