రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ 24 గంటలు నిరాహార దీక్ష
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి

X
shanmukha22 Sep 2020 11:40 AM GMT
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆయన లేఖ రాశారు. వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యుల ప్రవర్తన తనను మానసికంగా చాలా బాధకు గురిచేందని లేఖలో వివరించారు. ఎంపీల తీరుకు నిరసనగా 24 గంటలు నిరాహార దీక్షకు దిగనున్నట్టు తెలిపారు. రాజ్యసభలో ఆదివారం జరిగిన పరిణామాలకు తనకు రెండు రోజులుగా నిద్ర పట్టడంలేదని తెలిపారు. సభ్యుల తీరుతో సభ, సభాపతి స్థానం తీవ్ర అగౌరవానికి గురైయ్యాయని అన్నారు. తాను లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పుట్టిన గ్రామంలో పుట్టానని.. ఆయన స్పూర్తితో ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. కాగా ఈ రోజు ఉదయం ఆయన.. పార్లమెంట్ ఆవరణంలో నిరసన తెలుపుతున్న ఎంపీలకు టీ తీసుకొని వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎంపీల్లో పశ్చాత్తాపం కోసం ఈ విధంగా చేశానని తెలిపారు.
Next Story