HDFC బ్యాంకుకు షాకిచ్చిన RBI

HDFC బ్యాంకుకు షాకిచ్చిన RBI
గత రెండేళ్లలో మూడుసార్లు ఆన్‌లైన్‌ సర్వీసులకు డిస్ట్రబ్ కావడంతో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ షాకిచ్చింది. డిజిటల్‌, క్రెడిట్‌ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. గత రెండేళ్లలో మూడుసార్లు ఆన్‌లైన్‌ సర్వీసులకు డిస్ట్రబ్ కావడంతో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డిజిటల్‌-2 పేరుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రవేశపెట్టనున్న కార్యకలాపాలను టెంపరరీగా సస్పెండ్ చేసింది. కొత్తగా క్రెడిట్‌ కార్డుల కూడా ఇచ్చే అవకాశం లేదు.

సర్వీస్ సమస్యలే లేవన్న బ్యాంక్

తాజా నిబంధనల కారణంగా కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామంటోంది బ్యాంక్. లోపాలను సరిద్దిన వెంటనే ఆర్‌బీఐ విధించిన ఆంక్షలను ఎత్తివేస్తారని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలు బ్యాంకు రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ప్రైమరీ డేటా సెంటర్‌లో పవర్ ఇష్యూస్ కారణంగానే సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. గత నెల 21న డిజిటల్‌, ఆన్‌లైన్‌‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. గతేడాది డిసెంబర్‌లోనూ ఇదే సమస్య వచ్చింది. మొబైల్‌ బ్యాంకింగ్‌, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను పొందలేకపోయారు కస్టమర్లు. దీంతో తాజాగా RBI స్పందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 15,292 ఏటీఎంలున్నాయి. 14.9 మిలియన్‌ క్రెడిట్‌ కార్డులు, 33.8 మిలియన్‌ డెబిట్‌ కార్డులను కస్టమర్లకు బ్యాంక్‌ జారీ చేసింది.

ఇదే తొలిసారి...

బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంస్థ అయిన HDFC విషయంలో RBI తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. గతంలో ఏ బ్యాంకు విషయంలో ఇలా వ్యవహరించలేదు. కేవలం హెచ్చిరించి వదిలేశాయి కానీ ఇలా ఎప్పుడూ నేరుగా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు.

మరి వాటి సంగతేంటి?

HDFC మాత్రమే కాదు.. ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు టెక్నికల్ గా కస్టమర్లకు చుక్కలు చూపించాయి. SBI ఈ వారం రోజులుగా తీవ్ర విమర్శల పాలైంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. చాలామంది నేరుగా అకౌంట్లు క్లోజ్ చేస్తామని కూడా చెప్పారు. అక్టోబర్ లో ICICI బ్యాంకు కూడా డిజిటల్ సర్వీసుల్లో కస్టమర్ల సహనానికి పరీక్ష పెట్టింది.

మొత్తానికి తాజాగా పెరుగుతున్న టెక్నికల్ ఇష్యూస్ డిజిటల్ బ్యాంకింగ్ రంగాన్నే ప్రశ్నార్ధకం చేస్తోంది. గ్రామీణ వాతావరణానికి కూడా తీసుకెళతామంటున్న బ్యాంకులు.. సవాళ్లనే అధిగమించడం లేదు. మరి ఇంకా పెరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story