Digital Rupee : ఈ ఏడాది నుంచే డిజిటల్ కరెన్సీ..!

Digital Rupee : ఈ ఏడాది నుంచే డిజిటల్ కరెన్సీ..!
Digital Rupee : డిజిటల్‌ పేమెంట్స్‌తో ఇప్పటికే ఇండియా దూసుకుపోతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లేనంతగా.. మన దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ జరుగుతున్నాయి.

Digital Rupee : డిజిటల్‌ పేమెంట్స్‌తో ఇప్పటికే ఇండియా దూసుకుపోతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లేనంతగా.. మన దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ జరుగుతున్నాయి. ఇప్పుడు బడ్జెట్‌లో మరో డిజిటల్‌ ప్రకటన వచ్చింది. ఈ ఏడాది డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ మరింత అభివృద్ధి చెందుతుందని.. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది బూస్టర్‌లా పనిచేస్తుందని ఆకాంక్షించారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. డిజిటల్ కరెన్సీకి రూపకల్పన చేస్తునట్లు తెలిపారు.

తరచుగా మనం వింటున్న క్రిఫ్టో కరెన్సీ లాంటిదే ఈ డిజిటల్ కరెన్సీ కూడా. ఇది కూడా కంప్యూటర్‌ ఆధారిత కరెన్సీనే. అయితే క్రిఫ్టో కరెన్సీ లాగ ఇది అనామక కరెన్సీ కాదు. డిజిటల్ కరెన్సీని ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు మూలమైన సెంట్రల్ బ్యాంక్‌లు జారీ చేస్తాయి. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని జారీ చేస్తుంది. మార్కెట్‌లో బహిరంగ వేలం ద్వారా డిజిటల్ కరెన్సీ విలువను నిర్ణయిస్తారు. డిమాండ్ అండ్ సప్లయ్ సూత్రం ఆధారంగానే దీని విలువలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ కరెన్సీ యజమానులను ఆర్బీఐ గుర్తిస్తుంది. ఎంత పరిమాణంలో డిజిటల్ కరెన్సీని జారీ చేయాలో నిర్ణయించే అధికారం పూర్తిగా రిజర్వ్‌బ్యాంక్‌ చేతిలోనే ఉంటుంది.

క్రిఫ్టో కరెన్సీ తరహాలో ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేసేలా ఈ డిజిటల్ కరెన్సీ ఉండదు. పేపర్ కరెన్సీ తరహాలోనే ఇది కూడా పూర్తిగా ఆర్బీఐ ఆజమాయిషీలోనే ఉంటుంది. క్రిప్టో కరెన్సీలాగా నేర కార్యకలాపాలకు ఇది ఉపయోగపడదు. పేపర్ కరెన్సీలతో పోలిస్తే వీటితో జరిపే లావాదేవీల వ్యయం తక్కువ. నామమాత్రపు ఖర్చుతో భద్రంగా నిల్వ చేసుకోగలగడం డిజిటల్ కరెన్సీ వల్ల కలిగే మరో ప్రయోజనం. ఎంత పరిమాణంలో డిజిటల్ కరెన్సీని జారీ చేయాలో నిర్ణయించే అధికారం పూర్తిగా రిజర్వ్‌బ్యాంక్‌ చేతిలోనే ఉంటుంది. కాబట్టి.. ఈ కరెన్సీ వల్ల ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురయ్యే అకాశం ఉండదు.

Tags

Read MoreRead Less
Next Story