జాతీయం

పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం .. సీఎంను మార్చాలని డిమాండ్..!

Punjab Politics: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.

పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం .. సీఎంను మార్చాలని డిమాండ్..!
X

Punjab Politics: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను మార్చాలని సొంత పార్టీ శాసన సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సీఎంపై నలుగురు మంత్రులు, 32మంది ఎమ్మెల్యేలు తిరుబాటు బావుటా ఎగురవేశారు. సీఎం పార్టీ విశ్వాసాన్ని కోల్పోయారని వారు ఆరోపిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో సీఎం విఫలమయ్యారనీ, ఆయనపై తమకు నమ్మకం లేదని తిరుగుబాటుకు దిగారు.

ఈ మేరకు మంత్రి తృప్తి రాజీందర్‌ సింగ్‌ బజ్వా నివాసంలో అసంతృప్తినేతలు సమావేశమై చర్చించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని నివేదిస్తామని బజ్వా తెలిపారు. సీఎం పదవి నుంచి తప్పించాలని,జనం కూడా అదే కోరుకుంటున్నారని అంటున్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూ సలహాదారులపై చర్యలు చేపట్టాలని సొంతపార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ప్రకంపనలు సృష్టించింది. హామీలను ముఖ్యమంత్రి నెరవేరుస్తారనే నమ్మకం తమకు లేదని అసంతృప్త మంత్రులు అంటున్నారు. అమరీందర్‌కు ఉద్వాసన పలికి పీసీసీ అధ్యక్షుడు సిద్ధూను సీఎం చేయాలని శాసనసభ్యుడు సూర్జిత్‌సింగ్‌ ధిమన్‌ డిమాండ్‌ చేశారు.

Next Story

RELATED STORIES