పదవతరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. 5905 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

పదవతరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. 5905 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు..

అంగన్‌వాడీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 5905 పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు. ప్రధానంగా అంగన్‌వాడీలు, మినీ అంగన్‌వాడీల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతోంది. అభ్యర్దుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు.

మొత్తం పోస్టులో 4,007 అంగన్‌వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్‌వాడీ వర్కర్లు, 1,468 మెయిన్ అంగన్‌వాడీల్లో వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. అభ్యర్థుల కనీస విద్యార్హతను 10వ తరగతిగా ప్రభుత్వం నిర్ణయించింది. మెయిన్ అంగన్‌వాడీల్లో వర్కర్లకు రూ.11,500, మినీ అంగన్‌వాడీల్లో వర్కర్లకు రూ.7వేల చొప్పున వేతనాన్ని చెల్లించనున్నారు. హెల్పర్లకు కూడా రూ.7వేల చొప్పున వేతనాన్ని అందజేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story