60 మంది చిన్నారులకు ఆమె పాలు.. లాక్టౌన్ సమయంలో తల్లిపాలు దానం

60 మంది చిన్నారులకు ఆమె పాలు.. లాక్టౌన్ సమయంలో తల్లిపాలు దానం
లాక్డౌన్ సమయంలో తల్లి పాలను దానం చేసిన నిధి పర్మార్.. తాప్సీ పన్నూ, భూమి పెడ్నేకర్ నటించిన 'సాండ్ కి ఆంఖ్' నిర్మాత.

బహిరంగంగా తల్లి పాలివ్వడం వంటి అనేక అంశాలతో పాటు, తల్లి పాలను దానం చేయడంలో కళంకం ఉన్న దేశంలో, నిధి పర్మార్ హిరానందా తన బిడ్డకు పాలందిస్తూ.. మరో 60 మంది చిన్నారులకు తల్లి పాల రుచిని చూపించింది.. వారి ప్రాణాలను కాపాడింది.

లాక్డౌన్ సమయంలో తల్లి పాలను దానం చేసిన నిధి పర్మార్.. తాప్సీ పన్నూ, భూమి పెడ్నేకర్ నటించిన 'సాండ్ కి ఆంఖ్' నిర్మాత. ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో చిన్నారి 'వీర్‌' కు నిధి జన్మనిచ్చింది. మార్చి, మే నెలల మధ్య కాలంలో సుమారు 42 లీటర్ల తల్లి పాలను ఆమె చిన్నారుల కోసం దానం చేసారు.

మొదట తన బిడ్డకు పట్టి ఎక్కువగా ఉన్న పాలను ఖార్ ముంబైలోని సూర్య ఆసుపత్రికి దానం చేశారు. పాలు అధికంగా ఉత్పత్తి అయినా తల్లికి ఇబ్బందిగా ఉంటుంది. వాటిని వృథా చేయకూడదని ఆమె భావించింది. కానీ ఎక్కడ దానం చేయాలో తెలియదు. "నా బిడ్డకు ఫీడ్ చేసిన తరువాత, నా దగ్గర ఇంకా చాలా పాలు మిగిలి ఉన్నాయని నేను గ్రహించాను. రొమ్ము పాలు రిఫ్రిజిరేటర్‌లో సరిగ్గా నిల్వ చేస్తే మూడు నుంచి నాలుగు నెలల షెల్ఫ్ లైఫ్ ఉంటుందని నేను ఇంటర్నెట్‌లో చదివాను. దాని నుండి ఫేస్ ప్యాక్‌లను తయారు చేస్తున్నట్లు ఇంటర్నెట్‌లో చూశాను.

నా స్నేహితులు కొందరు తమ పిల్లలకు వాటితో స్నానం చేయించడంతో పాటు వారి పాదాలను స్క్రబ్ చేయడానికి కూడా ఉపయోగించినట్లు చెప్పారు. కానీ వారు చెప్పిన విషయాలు నాకు నచ్చలేదు. తల్లి పాలు ఎంతో అమూల్యమైనవి. వాటిని ఇలా వ్యర్థం చేయకూడదని భావించాను. నేను సెలూన్‌లకు ఇవ్వడానికి ఇష్టపడలేదు, తల్లి పాలు దానంపై పరిశోధన ప్రారంభించాను.



"బాంద్రాలోని ఉమెన్స్ హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్‌ను సంప్రదించాను, ఆ పాలను సూర్య ఆసుపత్రికి దానం చేయాలని సూచించాను. ఆసుపత్రిలో 2019 నుండి రొమ్ము పాలు బ్యాంక్ పనిచేస్తోంది.

అయితే తాను దానం చేసిన పాలు ఎవరెవరికి ఇస్తున్నారో తెలుసుకోవాలనుకుంది నిధి. ఆస్పత్రి వారిని సంప్రదించగా వారు ఒకసారి వచ్చి చూడమన్నారు. అక్కడకు వెళ్లిన ఆమెకు 60 మంది పసికందులను చూపించారు. వారందరికీ నిధి ఇచ్చిన పాలే పడుతున్నట్లు చెప్పారు సిబ్బంది. ఆమాట వినగానే తనకెంతో సంతోషం కలిగిందని నిధి చెప్పింది. తన చనుబాలు తాగుతున్న పిల్లలందరికీ ఆ పాలు చాలా అవసరమని, వారి కోసం తాను మరో ఏడాదిపాటు పాలు దానం చేస్తుంటానని నిధి ఆనందంగా చెబుతోంది.

నిధిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది చనుబాలు దానం చేయడానికి ముందుకు వస్తారని నిపుణులు భావిస్తున్నారు. ప్రతి తల్లి తన బిడ్డకి మొదటి ప్రాధాన్యం వచ్చి వృధాగా పోయే పాలను ఇలా దానం చేయడం మంచిదని దాని ద్వారా చిన్నారులకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన వారవుతారని వైద్యులు పేర్కొన్నారు. నిధి చేసిన పనికి ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story