Delhi: ఢిల్లీలో హై అలర్ట్..

Delhi: ఢిల్లీలో హై అలర్ట్..
Delhi: స్వాతంత్ర దినోత్సం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

స్వాతంత్ర దినోత్సం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లిలో ఎర్రకోటతో సహా కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు ముమ్మరం చేశాయి. చీమచిటుక్కుమన్నా... తెలిసేలా ప్రత్యేక టెక్నాలజీతో పహరా కాస్తున్నాయి భద్రతాదళాలు. యాంటీ డ్రోన్ల వ్యవస్థను పోలీసులు మోహరింప చేశారు. ఆగస్టు 15న ఢిల్లీలో డ్రోన్లు, బెలూన్లు వంటివాటిని ఎగరవేయడంపై నిషేధం విధించారు. మరోవైపు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవానికి దేశం మొత్తం సర్వం సిద్ధమౌతోంది. వజ్రోత్సవ వేడుకలు అంబరాన్నింటేలా కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నారు.

ఢిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో భద్రతను పెంచిన కేంద్రం...షార్ప్ షూటర్లు, NSG కమాండర్లుతో పాటు భద్రతా సిబ్బంది మోహరించింది. రెడ్ ఫోర్ట్ పరిసరాల్లోకి సాధారణ జనాన్ని అనుమతించటం లేదు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టార్గెట్ చేస్తూ... హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని...ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఎర్రకోట ప్రధాన ద్వారం వద్ద దారికి అడ్డంగా భారీ కంటైనర్లతో భారీ గోడనే నిర్మించారు. రిపబ్లిక్ డే నాటి హింస నేపథ్యంలో ...అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అలెర్ట్ అయ్యారు భద్రతా సిబ్బంది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నం అవుతున్న తరుణంలో ఢిల్లీ వ్యాప్తంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజధాని ఢిల్లీలో పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో నగరం అంతటా అనేక కంపెనీల కమాండోలను మోహరించారు. జమ్ముకశ్మీర్‌లో పోలీసులు ఇవాళ నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవంన దాడి చేసేందుకు వీరు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story