జీడిపప్పు, బాదాంలను వేయించి తింటున్నారా.. అయితే..

జీడిపప్పు, బాదాంలను వేయించి తింటున్నారా.. అయితే..
వీటిని వేయించి తింటే ఇందులో ఉన్న పోషకాలు క్షీణిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

గింజలు చాలా ఆరోగ్యకరమైనవి. ప్రయాణంలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్స్‌లాగా ఉపయోగపడతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లతో నిండి ఉంటాయి శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను, పోషకాలను అందిస్తాయి. నట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ నట్స్ వేయించడం వల్ల వాటి పోషకాలపై ప్రభావితం చూపిస్తుంది.

డ్రైఫ్రూట్స్, నట్స్‌లో పోషకాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి నట్స్ తీసుకోమంటూ వైద్యులు సూచిస్తుంటారు. నట్స్‌లో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. వీటిని వేయించి తింటే ఇందులో ఉన్న పోషకాలు క్షీణిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన కొవ్వుల ఆక్సీకరణ జరుగుతుంది.

విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి. అయితే వీటిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఓవెన్‌లో వేడి చేస్తే నష్టం ఉండదని పేర్కొన్నారు. ముడి బాదం కంటే కాల్చిన బాదం మీ శరీరానికి జీర్ణం కావడం సులభం అని నిపుణులు కనుగొన్నారు. నట్స్‌ని వేయించడం వలన అందులో ఉన్న కొన్ని ఆరోగ్యకరమైన పోషకాలు పాడవుతాయి. అంతేకాకుండా శరీరానికి హాని చేసే కెమికల్స్ విడుదలవుతాయి. ఆ కెమికల్స్‌లో కొన్ని కాన్సర్ కారకాలు కూడా ఉంటాయి.

వేయించిన నట్స్ అయితేనే పిల్లలు తింటారు అని భావించినట్లైతే బయట దొరికే రోస్టెడ్ నట్స్ కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే రోస్ట్ చేసుకున్నా ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా నాలుగైదు రోజుల్లో తినేస్తే మంచిది.

బాదం : ఒక ఔన్సు ముడి బాదంపప్పులో 161 కేలరీలు, 14 గ్రాముల కొవ్వు ఉంటే వేయించిన బాదంపప్పులో 167 కేలరీలు, 15 గ్రాముల కొవ్వు ఉన్నాయి.

జీడిపప్పు : ఒక ఔన్సు ముడి జీడిపప్పులో 157 కేలరీలు, 12 గ్రాముల కొవ్వు ఉంటే వేయించిన జీడిపప్పులో 163 ​​కేలరీలు, 13 గ్రాముల కొవ్వు ఉంటుంది.

Read MoreRead Less
Next Story