బిగ్‌బాస్ హౌస్ కి సన్యాసి.. ఆమె గురించి తెలిస్తే..

బిగ్‌బాస్ హౌస్ కి సన్యాసి.. ఆమె గురించి తెలిస్తే..
వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ కొత్త కొత్త వాళ్లను తీసుకువచ్చే ప్రయత్నం..

బిగ్‌బాస్ ఎన్ని భాషల్లో వచ్చినా అన్నింటా అత్యధిక ఆదరణ పొందుతోంది.. రేటింగ్‌లో దూసుకుపోతోంది. షో నిర్వాహకులు రకరాల ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులు బోర్ ఫీలవకుండా చూస్తారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ కొత్త కొత్త వాళ్లను తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటారు. బాలీవుడ్ బిగ్‌బాస్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. గత వారం అక్కడ ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 14 షోలో రాధే మాగా ప్రసిద్ధి చెందిన సుఖ్వీందర్ కౌర్ సందడి చేశారు.

దాంతో షోలో ఆమె ఉంటుందని ఆశించారంతా. కానీ ఆమె కేవలం పార్టిసిపెంట్స్‌ని ఆశీర్వదించడానికి వచ్చిందని తర్వాత తెలిసింది. షోలో ఆమె కనిపించడాన్ని అఖిల భారత అఖాడ పరిషత్ (ఏబీఏపీ) తప్పుపట్టింది. అయితే సంస్థకు చెందిన అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మాట్లాడుతూ రాధే మాకు కేవలం కాసినోలో పాటలు పాడడం, డ్యాన్స్ చేయడంలో మాత్రమే ఆమెకి ప్రావీణ్యం ఉంది. అది ఆమెను సాధువుగా చేయలేదు అని తెలిపారు. ఇక షోలో పాల్గొనడం అనేది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.

ఇంతకీ రాధే మా ఎవరు.. అసలు పేరు సుఖ్వీందర్ కౌర 1965 ఏప్రిల్‌లో పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలోని డోరంగల గ్రామంలో జన్మించారు. చిన్న వయసునుంచే ఆమె ఆధ్యాత్మికత వైపు ఆకర్షితురాలైనట్లు పేర్కొంటారు. మోహన్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. ప్రారంభంలో కుటుంబ పోషణ కోసం టైలర్ పని చేసేవారు. 23 ఏళ్ల వయసులో ఆమె మహంత్ రామ్ దీన్ దాస్ శిష్యురాలిగా చేరారు. ఆయనే ఆమెకు రాధే మా బిరుదు ఇచ్చారు.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాధే మా.. 2015లో అత్తమామలను వేధిస్తున్న కేసులో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అదే సంవత్సరంలో లండన్‌లోని ఒక కాసినోలో ఆమె పాశ్చాత్య దుస్తులు ధరించి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. అదే సంవత్సరంలో మాజీ బిగ్ బాస్ పోటీదారు డాలీ బింద్రా రాధే మా తనను లైంగికంగా వేధించిందని ఆరోపించారు. 2015లో బిగ్ బాస్ షోలో రాధే మా పాల్గొంటుందని ప్రచారం జరిగింది. అంతలోనే ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరించారని తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story