ఆరు దశాబ్దాలుగా గుహలో నివాసం.. అయినా రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం

ఆరు దశాబ్దాలుగా గుహలో నివాసం.. అయినా రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం
తన పేరును గోప్యంగా ఉంచాలని, తనకు ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదని చెప్పారు.

హరిద్వార్-రిషికేశ్‌కు చెందిన ఆక్టోజెనరియన్ సెయింట్ స్వామి శంకర్ దాస్ రామ మందిర నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. భక్తులు ఇచ్చిన పదో, పరకో అన్నీ కలిపి ఆయన పక్కన పెట్టారు. దాదాపు ఆరు దశాబ్దాలు గుహలోనే నివాసం ఉన్న అతడికి ఏనాడూ అనారోగ్యం దరిచేరలేదు.. పండూ, ఫలం తిని కడుపు నింపుకునే వారు. ఏ ఖర్చులూ లేవు. భక్తులు ఇచ్చిన కానుకలను ఆ దేవుడికే సమర్పించాలనుకున్నారు.

అయోధ్యలో రాములోరికి గుడికడుతున్నారని తెలిసి తన దగ్గరున్న మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలనుకున్నారు. మొత్తం లెక్క చూస్తే కోటి రూపాయలున్నాయి. అంత పెద్ద మొత్తం ఇస్తున్నారు, మీ పేరు, ఫోటో పేపర్లో వేస్తామంటే వద్దన్నారు. నేను కష్టపడి సంపాదించింది ఏమీ కాదుకదా.. ఆ భగవంతుడే భక్తుల రూపంలో నాకు ఇప్పించాడేమో.. మళ్లీ తిరిగి ఆయనకే చెందాలి ఆ నగదు అని ఎంతో వినమ్రంగా స్వామి శంకర్ దాస్ రామ మందిర ట్రస్ట్‌కి ఆ నగదు అందజేశారు.

స్వామి శంకర్ దాస్ ఆరు దశాబ్దాలుగా రిషికేశ్ వద్ద ఓ గుహలో ధ్యాన సాధన చేస్తున్నారు. తన గురుతాత్ వాలే బాబా గుహను సందర్శించే భక్తుల నుండి విరళాల రూపాంలో వచ్చిన మొత్తాన్ని సేకరించి రామ మందిర నిర్మాణానికి ఇస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఉన్న ఎస్‌బిఐ ప్రధాన శాఖకు చెక్కును అందజేశారు. దాస్ జి తన పేరును గోప్యంగా ఉంచాలని, తనకు ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదని చెప్పారు. కానీ ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చే వారిని ప్రోత్సహించే దిశగా స్వామి శంకర్ దాస్ ఇచ్చిన విరాళాన్ని బ్యాంకు వారు బహిరంగపరిచారు.

Tags

Read MoreRead Less
Next Story