SBI: ఎస్‌బిఐ కస్టమర్స్ అలర్ట్.. మే 31లోగా..

SBI: ఎస్‌బిఐ కస్టమర్స్ అలర్ట్.. మే 31లోగా..
వినియోగదారులు తమ KYC వివరాలను సమర్పించడానికి బ్రాంచ్ ని సందర్శించాల్సిన అవసరం లేదని ఎస్బిఐ ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

SBI: (ఎస్‌బిఐ) కస్టమర్లు తమ కెవైసి వివరాలను ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా అప్‌డేట్ చేసుకోవడానికి ఎస్‌బిఐ అనుమతిస్తుందని సంస్థ ప్రకటించింది. వినియోగదారులు తమ KYC వివరాలను సమర్పించడానికి బ్రాంచ్ ని సందర్శించాల్సిన అవసరం లేదని 2021 మే 1 న ఎస్బిఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది.

కోవిడ్ -19 కేసులు పెరగడంతో వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఎస్బిఐ పేర్కొంది.

KYC వివరాలను ఇంటి నుంచి ఎలా అప్‌డేట్ చేయాలి

కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో పొందలేరని, బ్యాంకింగ్ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని ఎస్బీఐ చెబుతోంది. కాబట్టి ఎస్బీఐ కస్టమర్లు అందరూ తప్పనిసరిగా 2021 మే 31 లోగా తమ కేవైసీని అప్డేట్ చేయాలి. కస్టమర్లు తమ హోమ్ బ్రాంచ్ లో మాత్రమే కాదు దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్ లో కూడా కేవైసీ వివరాలు అప్ డేట్ చేయొచ్చు.

భయపెడుతున్న కరోనా మహమ్మారి దానికి తోడు లాక్డౌన్. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుకు వెళ్లే పని లేకుండా ఇంటి నుంచే సంబంధిత డాక్యుమెంట్స్ ని కస్టమర్లు ఇ మెయిల్ ద్వారా బ్యాంకుకు పంపితే సరిపోతుంది.

కేవైసీ అప్ డేట్ అయిన తరువాత కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. అయితే కస్టమర్లు తమ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్ నుంచే కేవైసీ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది.

ఒకవేళ 10 ఏళ్ల లోపు పిల్లలకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ ఆపరేట్ చేస్తున్నవాళ్లే డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.

ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వేర్వేరుగా పంపాల్సి ఉంటుంది. ఐడీ ప్రూఫ్ కోసం పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, ప్రభుత్వ లేదా డిఫెన్స్ ఐడీ కార్డ్, ప్రముఖ ఎంప్లాయిర్స్ నుంచి ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్, పోస్ట్ ఆఫీసులు జారీ చేసిన ఫోటో ఐడీ కార్డ్, యూజీసీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యార్థులకు జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డులు స్కాన్ చేసి పంపొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story