దానితో ఎక్కడ టచ్ చేసిన అత్యాచారమే.. కేరళ హైకోర్టు తీర్పు..!

దానితో ఎక్కడ టచ్ చేసిన అత్యాచారమే.. కేరళ హైకోర్టు తీర్పు..!
ఓ అత్యాచారానికి సంబంధించిన విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పురుషుడు తన అవయవంతో అమ్మాయిని ఎక్కడ తాకిన అది అత్యాచారమే అని పేర్కొంది

ఓ అత్యాచారానికి సంబంధించిన విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పురుషుడు తన అవయవంతో అమ్మాయిని ఎక్కడ తాకిన అది అత్యాచారమే అని పేర్కొంది. పోక్సో చట్టం కింద నమోదైన ఓ లైంగిక దాడి కేసుపై గురువారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో భాగంగా నిందితుడు తాను లైంగిక దాడికి పాల్పడలేదని కేవలం తన జననాంగంతో టచ్‌ చేశానని చెప్పుకొచ్చాడు. అది లైంగిక దాడి కిందికి ఎలా వస్తుందని కోర్టుకు తెలిపాడు. అతని వాదనని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం దీనిపైన ఓ వివరణ ఇచ్చింది. సెక‌్షన్‌ 375 ప్రకారం.. అమ్మాయి జననాంగాలతో పాటు ఆమె శరీరంపై పురుషుడి అవయవం ఎక్కడ తాకినా అది అత్యాచారం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. అయితే బాధితురాలి న్యాయవాది ఆమె వయసును నిర్ధారించకపోవడంతో ఈ కేసును కొట్టివేసింది. ఇక నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story